IPL 2019: Chennai Super Kings 155 for 6 (Dhoni 58, Rayudu 57, Stokes 2-39) defeat Rajasthan Royals 151 for 7 (Stokes 28, Buttler 23, Jadeja 2-20) by four wickets
#IPL2019
#MSDhoni
#ChennaiSuperKings
#RajasthanRoyals
#josButtler
#Jadeja
#ambatiRayudu
#BenStokes
సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్ ఆఖరి బంతికి ముగిసింది. రాజస్థాన్ రాయల్స్‌తో జైపూర్ వేదికగా గురువారం రాత్రి తీవ్ర ఉత్కంఠ, వివాదాల నడుమ ముగిసిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఆఖరి ఓవర్‌లో చెన్నై విజయానికి 18 పరుగులు అవసరమగా.. తొలి బంతికే జడేజా(10 నాటౌట్: 4 బంతుల్లో 1x6)తో సిక్స్ కొట్టించుకున్న బెన్‌స్టోక్స్.. ఆ తర్వాత ధోనీ(58: 43 బంతుల్లో 2x4, 3x6)ని క్లీన్‌బౌల్డ్ చేసి మ్యాచ్‌ని ఉత్కంఠగా మార్చేశాడు. కానీ.. అప్పటికే ఆ ఓవర్‌లో ఒక నోబాల్ విసిరిన బెన్‌స్టోక్స్.. నాలుగో బంతిని కూడా నోబాల్ రూపంలో విసిరాడు. కానీ ఫీల్డ్ అంపైర్ల మధ్య ఈ నోబాల్‌పై భేదాభిప్రాయాలు వచ్చాయి. ఆ బంతిని నోబాల్ ఇవ్వలేదు. దీంతో.. సమీకరణం చివరి 2 బంతుల్లో 6 పరుగులుగా మారిపోగా.. ఐదో బంతికి రెండు పరుగులిచ్చిన బెన్‌స్టోక్స్.. ఆ తర్వాత వైడ్ వేసి.. ఆఖరి బంతికి మిచెల్ శాంట్నర్ (10 నాటౌట్: 3 బంతుల్లో 1x6)తో సిక్స్ కొట్టించుకున్నాడు. దీంతో.. 152 పరుగుల లక్ష్యాన్ని చెన్నై జట్టు 155/6తో ఛేదించింది.